
Char Dham Yatra: భారత-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఛార్ ధామ్ యాత్ర రద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రను రద్దు చేసే ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ యాత్రను నిలిపివేయాలని స్పష్టమైన ఉత్తర్వులను ఇచ్చింది.
ఉత్తరాఖండ్‌లోని దేవాలయాల తలుపులు ఇటీవలే తెరుచుకున్న విషయం తెలిసిందే.
చార్ ధామ్ యాత్రకు ఇప్పటికే భారీగా భక్తులు తరలిస్తున్నారు.
Details
హెలికాప్టర్ సేవలు కూడా రద్దు
అయితే పాకిస్తాన్ హిందూ దేవాలయాలపై డ్రోన్ దాడులు చేయడం, భద్రతా పరిస్థితులు మరింత క్షీణించడంతో, యాత్రను కొంతకాలం నిలిపివేయాలని మోడీ సర్కార్ భావించింది.
బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్ళే భక్తులు తమ ప్రయాణాలను ప్రస్తుతం వాయిదా వేయాలని సూచించారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ యాత్ర కొనసాగకూడదు.
అటు, అక్కడి హెలికాప్టర్ సేవలను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.