
PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకీ తీవ్రతను సంతరించుకుంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులతో పాటు ముఖ్య భద్రతా అధికారు భాగస్వామ్యం చేశారు.
డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ భారత్‌పై దాడులకు తెగబడిన నేపథ్యంలో, భారత్ కూడా దీటుగా ప్రతిఘటించిన పరిణామాల్లో ఈ భేటీ ప్రాధాన్యతను సంపాదించింది.
ఈ కీలక సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు.
Details
భద్రత ఏర్పాట్లపై సమీక్షా
ఈ సమావేశానికి ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, హోంశాఖకు చెందిన సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో సరిహద్దు ప్రాంతాలు, విమానాశ్రయాలు వంటి కీలక ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ చర్యలు దేశ భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టాయి.
ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా భద్రతపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిని స్పష్టంగా చూపుతున్నాయి.