Page Loader
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌ పూంచ్ వద్ద ఉగ్రదాడి.. అమరులైన ఐదుగురు జవాన్లు 
అమరులైన ఐదుగురు జవాన్లు

Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌ పూంచ్ వద్ద ఉగ్రదాడి.. అమరులైన ఐదుగురు జవాన్లు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 22, 2023
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌(Jammu Kashmir)లో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలోని బ్లైండ్ కర్వ్ వద్ద రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో ఐదుగురు జవాన్లు మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు సైనిక అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు ఒక కొండపై నుంచి తమ వాహనాలపైకి బుల్లెట్లు కాల్చారని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. బ్లైండ్ కర్వ్ ఎగుడుదిగుడుగా ఉన్న రహదారి కారణంగా ఆర్మీ వాహనాలు వేగాన్ని తగ్గించాయని,ఈ కారణంగానే ధాత్యార్ మోర్హ్ ప్రదేశంలో ఆర్మీవాహనాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 జమ్మూ కాశ్మీర్‌ పూంచ్ వద్ద ఉగ్రవాదుల కలకలం

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదుల దాడి