TG Weather: రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వచ్చే 2 గంటల్లో వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 2-3 గంటల వ్యవధిలో వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాక, గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నందున ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా, ఈరోజు,రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వివరాలు
ఈరోజు వర్షం పడే అవకాశం ఉన్న ప్రాంతాలు ఇవే..
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముందని అంచనా వేసింది. రేపటికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో చినుకులు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంటూ, సంబంధిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగిస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ వెదర్ మెన్ చేసిన ట్వీట్
Scattered LIGHT - MODERATE RAINS ahead in Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Kamareddy and parts of Vikarabad, Sangareddy in next 3hrs ⛈️
— Telangana Weatherman (@balaji25_t) February 22, 2026
More rains ahead in Central, East, West TG districts from late morning hours ⛈️
Today will be main day of UNSEASONAL RAINS in Telangana,…
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ వెదర్ మెన్ చేసిన ట్వీట్
MAIN DAY OF UNSEASONAL RAINS ⚠️
— Telangana Weatherman (@balaji25_t) February 23, 2026
Feb 23, 2026 FORECAST ⛈️
Zone 1 - Scattered MODERATE RAINS and THUNDERSTORMS ahead in Medak, Siddipet, Kamareddy, Vikarabad, Yadadri - Bhongir, Sangareddy, Nizamabad, Sircilla, Jagitial, Mancherial, KB Asifabad during afternoon to evening hours…