TGPSC Job Notification: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 102 ఉద్యోగాలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో 102 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. రాత పరీక్ష జనవరిలో నిర్వహించే అవకాశం ఉందని కమిషన్ వెల్లడించింది. పరీక్షకు ఏడు రోజుల ముందుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచుతామని తెలిపింది. చివరి తేదీ వరకు వేచి చూడకుండా అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
వివరాలు
దరఖాస్తు రుసుము
ఈ ఉద్యోగాలకు గణాంక శాస్త్రం (స్టాటిస్టిక్స్) ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుమును ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000గా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు.
2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు.
రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హులైన వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఈ పోస్టులకు ఎంపికైనవారికి నెలవారీ వేతన స్కేలు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు ఉంటుంది.
విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, జోన్ల వారీగా ఖాళీలు, పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ లో తెలుసుకోవచ్చు.