Loading...
Dasara Special Buses: దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఇంటివద్దకే ప్రత్యేక బస్సులు
దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఇంటివద్దకే ప్రత్యేక బస్సులు

Dasara Special Buses: దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఇంటివద్దకే ప్రత్యేక బస్సులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ సమయంలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ ఈడీ శ్రీధర్ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రయాణికులు ఉండే ప్రాంతాల నుంచే నేరుగా ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ముఖ్యంగా వివిధ కళాశాలలు, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది. విద్యార్థులు తమ నివాస ప్రాంతాల నుంచే ముందుగానే ప్రత్యేక బస్సులను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో పండుగ రద్దీ సమయంలో బస్‌స్టాండ్లకు చేరుకోవాల్సిన ఇబ్బందులు తగ్గనున్నాయి.

వివరాలు 

30 మంది ఉంటే మీ ప్రాంతానికే స్పెషల్ బస్సు

కాలనీ, టౌన్‌షిప్, హాస్టల్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో కనీసం 30 మంది ప్రయాణికులు సొంతూరికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటే.. టీజీఎస్‌ఆర్టీసీ నేరుగా వారి వద్దకే ప్రత్యేక బస్సును పంపనుంది.

ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

దీంతో ఒకే ప్రాంతానికి చెందిన వారు సమూహంగా ముందస్తుగా బస్సును బుక్ చేసుకుని నేరుగా తమ గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

వివరాలు 

జిల్లాల వారీగా ముందస్తు బుకింగ్‌.. JBS కమ్యూనికేషన్ సెల్ నంబర్ ఇదే

హైదరాబాద్‌ నుంచి వరంగల్,కరీంనగర్,మహబూబ్‌నగర్,నిజామాబాద్,ఖమ్మం,భద్రాచలం, నల్గొండ, సూర్యాపేటతో పాటు ఇతర ప్రధాన జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తుగా ప్రత్యేక బస్సులను బుక్ చేసుకోవచ్చు.

ఇందుకోసం సంబంధిత డివిజనల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్లను సంప్రదించి బస్సులను కేటాయించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

దసరా రద్దీ సమయంలో విద్యార్థులు,ఉద్యోగులు బస్‌స్టాండ్లకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ ముందస్తు బుకింగ్ విధానం ఉపయోగపడనుంది.

ముఖ్యంగా ఒకే ప్రాంతానికి చెందిన ప్రయాణికులు ముందుగానే బస్సును బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణాన్ని సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

ప్రత్యేక బస్సుల కేటాయింపు,బుకింగ్‌కు సంబంధించిన సమాచారం, ఇతర వివరాల కోసం ప్రయాణికులు జూబ్లీ బస్ స్టేషన్ (JBS) జోనల్ కమ్యూనికేషన్ సెల్‌ను సంప్రదించాలని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సూచించింది.

ఇందుకోసం 9959226160 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపింది.

ADVERTISEMENT