TDP: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు.. పాలకొల్లులో హై టెన్షన్
ఈ వార్తాకథనం ఏంటి
మరో టీడీపీ కీలక నేత బుధవారం అరెస్టు అయ్యారు. పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు అరెస్టు అయ్యారు. దీంతో పాలకొల్లులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
'పాలకొల్లు చూడు' పేరుతో నిమ్మల రామానాయుడు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
నిరసనలో భాగంగా పెంకిళ్లపాడు టిడ్కో ఇళ్ల వద్ద వంటా వార్పు చేసేందుకు టీడీపీ శ్రేణులతో సిద్ధమయ్యారు.
రామానాయకులు నిరసనకు కౌంటర్‌గా వైసీపీ కూడా అదే ప్రాంతంలో ఆందోళనకు పిలుపునిచ్చింది.
వైసీపీ వైకాపా పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొడాల గోపి ఆధ్వర్యంలో 'నిజం చెబుతాం' నిరసన కార్యక్రమాన్ని చేప్టటింది.
టీడీపీ
గాంధీ విగ్రహం వద్ద తోపులాటలో కింద పడ్డ ఎమ్మెల్యే
ఈ క్రమంలో రెండు పార్టీల నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
అయినా.. టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు రామానాయుడిని గృహనిర్బంధం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే రామానాయుడు పోలీసులను తప్పించుకొని నాయకులతో కలిసి జాతీయ జెండాలతో పాలకొల్లులోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. గాంధీకి పూలమాల వేస్తుంటే అడ్డుకోవడం ఏంటిని ఎమ్మెల్యే మండిపడ్డారు.
ఇదే సమయంలో టీడీపీ, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కిందపడిపోయారు.
ఆ తర్వాత పోలీసులు ఎమ్మెల్యేను అరెసు చేసారు. అనంతరం ఆయన్ను భీమవరం వైపునకు తీసుకెళ్లినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.