Page Loader
మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట; అనారోగ్యంతో ఉన్న భార్యను కలవడానికి కోర్టు అనుమతి 
మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట; అనారోగ్యంతో ఉన్న భార్యను కలవడానికి కోర్టు అనుమతి

మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట; అనారోగ్యంతో ఉన్న భార్యను కలవడానికి కోర్టు అనుమతి 

వ్రాసిన వారు Stalin
Jun 02, 2023
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఉపశమనం లభించింది. ప్రస్తుతం జైలులో ఉన్న అతడిని జూన్ 3(శనివారం)న అనారోగ్యంతో ఉన్న తన భార్యను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలవడానికి కోర్టు అనుమతిచ్చింది. సిసోడియా పిటిషన్‌పై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేపటిలోగా సిసోడియా తన భార్య మెడికల్ రిపోర్టులను అందజేయాలని కోర్టు కోరింది. మద్యంతర బెయిల్ మీద ఇంటికి వెళ్తున్న సిసోడియా.. తన కుటుంబ సభ్యులను తప్ప మరెవరినీ కలవడానికి వీల్లేదని కోర్టు షరతులు విధించింది. అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో సీసోడియా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలను ఎదురొంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిసోడియాకు మద్యంతర బెయిల్