Loading...
Nara Lokesh: రాప్తాడు బాలిక కోలుకుంటోంది.. త్వరలోనే నడుస్తుందని ఆశిస్తున్నా: లోకేశ్
రాప్తాడు బాలిక కోలుకుంటోంది.. త్వరలోనే నడుస్తుందని ఆశిస్తున్నా: లోకేశ్

Nara Lokesh: రాప్తాడు బాలిక కోలుకుంటోంది.. త్వరలోనే నడుస్తుందని ఆశిస్తున్నా: లోకేశ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 07, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అనంతపురం జిల్లా రాప్తాడులోని ఉన్నత పాఠశాలలో ఉన్మాది రంపంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుంటోందని వెల్లడించారు. ఈ మేరకు లోకేశ్‌ ఎక్స్‌ (X) వేదికగా స్పందించారు. ''ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉంది. ఇవాళ కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చొంది. వైద్యులు ఆమెకు ఘన ఆహారం ఇవ్వడం ప్రారంభించారు. ఇవాళ ఆమె కొన్ని అడుగులు వేయగలదని ఆశిస్తున్నాను. మీ నిరంతర ప్రార్థనలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన గోపిక ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో ఆమె త్వరగా పూర్తిగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

ADVERTISEMENT