
కొత్త తరం లాంచ్ వెహికల్ కోసం మా బృందం పని చేస్తోంది: ఇస్రో చీఫ్ సోమనాథ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్‌జిఎల్‌వీ) కోసం నమూనా ఖరారైందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
కొత్త తరం లాంచ్ వెహికల్ కోసం తమ పెద్ద బృందం పనిచేస్తోందని సోమనాథ్ తెలిపారు.
రాకెట్ ఎలా ఉండాలనే దానిపై తమ బృందం ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించిందని వెల్లడించారు.
సాంకేతిక ఇన్‌పుట్, అనుసరించాల్సిన విధానాలు, ఎక్కడ చేయాలి, ఎలాంటి తయారీ విధానాన్ని అనుసరించాలనే పూర్తి వివరాలను తమ బృందం నివేదికలో చెప్పినట్లు పేర్కొన్నారు.
కొత్త తరం ప్రొపల్షన్‌ను ఉపయోగించి, క్రయోజెనిక్ ప్రొపల్షన్‌ని కలిగి ఉండేలా, పేలోడ్‌ను మెరుగుపరిచి వాహననౌకను తయారు చేయాలని తాము అనుకున్నట్లు చెప్పారు.
ఇస్రో
స్వదేశీ పరిజ్ఞానంతో వాహన నౌక తయారు
స్పేస్‌క్రాఫ్ట్ మిషన్ ఆపరేషన్స్‌పై ఎస్ఎంఓపీఎస్-2023 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో సోమనాథ్ మాట్లాడారు.
భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఊపయోగించి లాంచ్ వెహికల్‌ను తాయారు చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు.
కొత్త తరం వాహన నౌక చివరికి ప్రభుత్వ, ఇతర ప్రయోగాలకు వాణిజ్య ప్రయోగ వాహనంగా అందించబడుతుందని సోమ్ నాథ్ వివరించారు.
కొత్త రాకెట్ అభివృద్ధి చేయడం అనేది దీర్ఘకాలిక ప్రక్రియ అని, కాబట్టి దీనికి 5-10 సంవత్సరాలు పట్టవచ్చని చెప్పారు.
కానీ మంచి విషయమేమిటంటే వాహన నౌక తయారీకి కేవలం డబ్బులు పెడితే సరిపోతుందని, పరిజ్ఞానం తమ దగ్గర ఉందని పేర్కొన్నారు.
ఈ జూలైలో చంద్రయాన్ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.