Page Loader
డీకే శివకుమార్‌కు భారీ ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు 
డీకే శివకుమార్‌కు భారీ ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు

డీకే శివకుమార్‌కు భారీ ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Stalin
Mar 05, 2024
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది. డీకే శివకుమార్‌పై ఉన్న మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018లో డీకే శివకుమార్‌పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఈడీ ఆయన్ను అరెస్టు కూడా చేసింది. అయితే అతను దిల్లీ హైకోర్టు ఆదేశాలతో బెయిల్‌పై బయటకు వచ్చారు. బీజేపీ ప్రభుత్వం ప్రతీకారంగానే తనపై చర్యలు తీసుకుంటోందని డీకే శివకుమార్ అన్నారు. పీఎంఎల్‌ఏ కింద శివకుమార్‌పై చేపట్టిన చర్యలు చట్టం, నిబంధనలకు అనుగుణంగా లేవని మంగళవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేలా మాధుర్య త్రివేదిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

కర్ణాటక

అసలు విషయం ఏమిటి?

2017లో ఆదాయపన్ను శాఖ జరిపిన దాడుల్లో డీకే శివకుమార్‌ ఇంటి నుంచి భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ దాడి తర్వాత.. ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. ఈడీ దర్యాప్తు ఆధారంగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సైతం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి రాష్ట్ర బిజెపి ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసి 2019 సెప్టెంబర్‌లో శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేసింది. అయితే నెల రోజుల తర్వాత దిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ చర్యలను సవాల్ చేస్తూ.. 2019లో శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే శివకుమార్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.