రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు ఆ పెను ప్రమాదం 288మందిని బలితీసుకుంది. ఒడిశా రైలు ప్రమాదం తర్వాత, ట్రైన్ యాక్సిడెంట్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం దిల్లీ-భువనేశ్వర్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.
జార్ఖండ్‌లోని బొకారో వద్ద సంతల్దిహ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో గేటును ట్రాక్టర్ ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్లు ఒక రైల్వే అధికారి తెలిపారు.
సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే ట్రాక్,గేట్ మధ్య ట్రాక్టర్ ఇరుక్కుపోయినట్లు రైల్వే అధికారి పేర్కొన్నారు.
రైలు ప్రమాదం
చాకచక్యంతో రైలు బ్రేకులు వేసిన లోకో పైలెట్
రైల్వే గేటును మూసివేస్తున్న సమయంలో ట్రాక్టర్ రైలును ఢీకొట్టినట్లు, ఇదే సమయంలో డ్రైవర్ బ్రేకులు వేయడంతో రైలు ఆగిపోయిందని, తద్వారా పెను ప్రమాదం తప్పిందని సౌత్ ఈస్టర్న్ రైల్వే డీఆర్ఎం మనీష్ కుమార్ తెలిపారు.
ఈ ఘటనతో రైలు దాదాపు 45 నిమిషాలు ఆలస్యమైంది. ట్రాక్టర్‌ను సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, గేట్ మ్యాన్‌ను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
ట్రాక్టర్ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు పోలీసులు చెప్పారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు దుర్ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైలు ఢీకొన్నాయి.