అయోధ్య రామ మందిరం లోపల చిత్రాలను షేర్ చేసిన రామ జన్మభూమి ట్రస్ట్
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరం లోపల నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలను షేర్ చేస్తూ.. 'శ్రీరామ జన్మభూమి మందిరం లోపల నిర్మాణం' అనే క్యాప్షన్‌ను ట్రస్ట్ జోడించింది. వచ్చే ఏడాది జనవరి 22న రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధాని మోదీకి ఆహ్వానాన్ని అందజేశారు. అయోధ్యలోని రామమందిరంలోని గర్భగృహలో రాముడి విగ్రహాన్ని ఉంచనున్నారు. మూడంతస్తుల ఆలయానికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 14న రామ్ లల్లాకు పట్టాభిషేకం చేసే ప్రక్రియను ప్రారంభించాలని ట్రస్ట్ ప్లాన్ చేసింది.