Page Loader
రూ.88,032.5 కోట్ల విలువైన 500 నోట్ల మాయంపై ఆర్‌బీఐ కీలక ప్రకటన
రూ.88,032.5 కోట్ల విలువైన 500 నోట్ల మాయంపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

రూ.88,032.5 కోట్ల విలువైన 500 నోట్ల మాయంపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

వ్రాసిన వారు Stalin
Jun 18, 2023
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లు మాయమైపోయినట్లు వచ్చిన ఆరోపణలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఖండించింది. ఫ్రీ ప్రెస్ జర్నల్ ప్రకారం, 375.45 మిలియన్ విలువైన రూ. 500 నోట్లను ముద్రించినట్లు సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద వెల్లడైంది. అయితే ఏప్రిల్ 2015 నుంచి డిసెంబర్ 2016 మధ్య ఆర్‌బీఐకి 345.000 మిలియన్ రూపాయల విలువైన రూ.500నోట్లు మాత్రమే అందినట్లు ఆర్‌ బి ఐ రికార్డు చెబుతోందని ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదించింది. ఈ క్రమంలో మిగతా రూ.500 నోట్లు అదృశ్యమైనట్లు నివేదిక చెప్పింది.

ఆర్‌బీఐ

అన్ని నోట్లకు సరైన లెక్కలు ఉన్నాయి: ఆర్బీఐ

ఫ్రీ ప్రెస్ జర్నల్ ఈ నివేదికపై తాజాగా ఆర్‌బీఐ స్పందించింది. ఆ నివేదికలో నివేదికలో ఎలాంటి వాస్తవం లేదని నొక్కిచెప్పింది. ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి సమాచార హక్కు చట్టం, 2005 కింద సేకరించిన సమాచారంలో తప్పుడు వివరాలు ఉన్నయని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి ఆర్‌బిఐకి సరఫరా చేసిన అన్ని నోట్లకు సరైన లెక్కలు ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. నోట్ల ఉత్పత్తి, నిల్వ, పంపిణీని పర్యవేక్షించే ప్రోటోకాల్‌లతో పాటు, ప్రెస్‌లలో ముద్రించిన, సరఫరా చేసిన బ్యాంకు నోట్ల పునరుద్ధరణ కోసం పటిష్టమైన వ్యవస్థలు ఉన్నాయని ఆర్బీఐ చెప్పింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆర్‌బీఐ చేసిన ట్వీట్