
Bengaluru: లేడిస్ వాష్‌రూంలో మొబైల్.. రికార్డు అవుతుండగా చూసి షాకైన మహిళ
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని ఓ పాపులర్ కాఫీ షాప్‌లో మహిళలకు ఓ చేదు అనుభవం ఎదురైంది. లేడీస్ వాష్ రూమ్‌లోని డస్ట్ బిన్‌లో మొబైల్ రికార్డు అవుతుండటం గమనించింది.
ఈ చూసిన ఆమె షాక్ కు గురైంది. అప్పటికే రెండు గంటల పాటు రికార్డు అయినట్లు ఆ మహిళ గుర్తించింది.
ఆ మొబైల్ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టి రికార్డు చేసినట్లు తెలిపింది.
ఈ ఘటన బీఈఎల్ రోడ్డులోని థర్డ్ వేవ్ కాఫీ షాప్‌లో చోటు చేసుకుంది.
ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఓ పోస్టు వైరల్ అవుతోంది.
Details
భవిష్యతులో ఇలాంటి ఘనటలు జరగకుండా చూసుకుంటాం
బెంగళూరులోని థర్డ్ వేవ్ కాఫీ ఔట్ లెట్‌లో ఓ మహిళకు వాష్ రూమ్ లోని డస్ట్ బిన్‌లో మొబైల్ కనిపించింది.
కెమెరా మాత్రం కనిపించేలా డస్ట్ బిన్ కి ఓ రంధ్రం పెట్టారు. వెంటనే గుర్తించిన ఆ మహిళ సిబ్బందికి చెప్పింది.
అక్కడే పని చేస్తున్న ఓ ఉద్యోగి ఈ పని చేసినట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడికి ఆ వ్యక్తిని విచారించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
దీనిపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఇలాంటి వాటిని అసలు సహించమని, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటామని ధర్డ్‌వేర్ వేవ్ ఔట్ లెట్ స్పందించింది.