People's Budget:"ప్రజల బడ్జెట్,పొదుపు,పెట్టుబడి పెరుగుతాయి".. బడ్జెట్‌పై స్పందించిన పీఎం మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌పై (Union Budget) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు.
ఈ బడ్జెట్ 140 కోట్ల మంది ప్రజల ఆశలను నెరవేర్చేదిగా ఉంటుందని ఆయన ప్రశంసించారు.
అలాగే, పొదుపు,పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్ దేశాన్ని వికసిత భారత్ దిశగా ముందుకు నడిపిస్తుందని స్పష్టం చేశారు.
వివరాలు
140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ ఇది
''భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక కీలక మైలురాయి.ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబించే బడ్జెట్.ప్రతి భారతీయుడి కలలు సాకారం చేయడమే దీని ప్రధాన లక్ష్యం.అనేక రంగాల్లో యువతకు అవకాశాలను అందిస్తున్నాం.సాధారణంగా బడ్జెట్‌లు ప్రభుత్వ ఖజానాను మెరుగుపరచడంపై దృష్టి పెడతాయి.అయితే, ఈసారి ప్రజల చేతిలో డబ్బు నిలవడం, పొదుపులు పెరగడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాం'' అని ప్రధాని మోదీ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోడీ చేసిన ట్వీట్
The #ViksitBharatBudget2025 reflects our Government’s commitment to fulfilling the aspirations of 140 crore Indians. https://t.co/Sg67pqYZPM
— Narendra Modi (@narendramodi) February 1, 2025