Loading...
TTD: తిరుమలలో రూమ్‌ బుకింగ్‌కు ప్రయత్నించిన చాట్‌జీపీటీ-6 ఆస్ట్రా.. పేమెంట్‌ దగ్గర ఆగిన ఏఐ
పేమెంట్‌ దగ్గర ఆగిన ఏఐ

TTD: తిరుమలలో రూమ్‌ బుకింగ్‌కు ప్రయత్నించిన చాట్‌జీపీటీ-6 ఆస్ట్రా.. పేమెంట్‌ దగ్గర ఆగిన ఏఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమలలో వసతి గదిని బుక్‌ చేసేందుకు ఓ ఏఐ ఏజెంట్‌ చేసిన ప్రయత్నం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆన్‌లైన్‌ సేవల కోసం ప్రతిరోజూ లక్షలాది మంది వినియోగించే తితిదే వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన ఏఐ మోడల్‌.. రూమ్‌ బుకింగ్‌ ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. అయితే పేమెంట్‌ దశలో మాత్రం నిలిచిపోయింది. టెక్‌ బై పవన్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ విషయానికి సంబంధించిన వీడియోను ఓ టెకీ షేర్‌ చేశారు. వీడియో ప్రకారం.. డిసెంబర్‌ 21న తిరుమలలో వసతి గదిని బుక్‌ చేయాలని అత్యాధునిక ఏఐ ఏజెంట్‌ అయిన చాట్‌జీపీటీ-6 ఆస్ట్రాకు ఆయన సూచించారు.

వివరాలు 

దర్శన టికెట్‌ లేకుండా తితిదే వెబ్‌సైట్‌ ద్వారా వసతి గదిని బుక్‌ చేసుకోవడం సాధ్యం కాదు 

యూజర్‌ లాగిన్‌ వివరాలను ఉపయోగించుకుని ఆ ఏఐ ఏజెంట్‌ తితిదే వెబ్‌సైట్‌లోకి ప్రవేశించింది.

అనంతరం అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్లను పరిశీలించి, అవసరమైన వాటిని ఎంచుకుంది.

బుకింగ్‌ ప్రక్రియను ఒక్కో దశగా పూర్తి చేస్తూ చివరి దశ వరకు తీసుకెళ్లింది.

అయితే పేమెంట్‌ చేయాల్సిన సమయంలో మాత్రం ప్రక్రియ ఆగిపోయింది.

బ్యాంకు వివరాలను అందించకపోవడంతోనే చెల్లింపు దశను దాటలేకపోయినట్లు ఆ టెకీ వీడియోలో పేర్కొన్నారు.

ఈ విషయంపై తితిదే ఐటీ అధికారిని సంప్రదించగా.. దర్శన టికెట్‌ లేకుండా తితిదే వెబ్‌సైట్‌ ద్వారా వసతి గదిని బుక్‌ చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT