PM Modi: మోదీని ఆటపట్టించిన ఖర్గే.. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయాల్లో నేతల మధ్య విభేదాలు సాధారణమే.అయితే,వాటిని పక్కనపెట్టి ఒకే వేదికపై సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తే ఆ దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన ఓ చిన్న సంభాషణ ఇలాంటి ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. వీరిద్దరి మధ్య జరిగిన సరదా మాటలు అక్కడ నవ్వులు పూయించాయి. దిల్లీలో ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలే కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి ఆయనతో కరచాలనం చేశారు.
వివరాలు
అప్పటిలా లేరు.. కాస్త మారారు!
అనంతరం అక్కడే ఉన్న ప్రియాంక గాంధీని పలకరించారు. ''ప్రియాంకా జీ.. ఎలా ఉన్నారు?'' అని మోదీ అడిగారు.
అందుకు ప్రియాంక స్పందిస్తూ..''బాగున్నాను.. మీరెలా ఉన్నారు?''అని ప్రశ్నించారు.
దీనికి ప్రధాని మోదీ నవ్వుతూ..''నేను అలాగే ఉన్నాను'' అని సమాధానమిచ్చారు.
ఈ సమయంలో పక్కనే ఉన్న మల్లికార్జున ఖర్గే సరదాగా సంభాషణలోకి వచ్చారు.
''అలా ఏమీ లేదు.. మీరు కొంచెం మారిపోయారు'' అంటూ మోదీని ఉద్దేశించి చమత్కరించారు.
ఖర్గే వ్యాఖ్యతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది.
మోదీ కూడా చిరునవ్వుతో ఖర్గే భుజంపై సరదాగా తట్టారు.
అనంతరం ఇద్దరూ చేతులు కలుపుతూ నవ్వుకున్నారు.
రాజకీయంగా భిన్న ధ్రువాల్లో ఉన్న నేతలు ఇలా స్నేహపూర్వకంగా, సరదాగా మాట్లాడుకున్న ఈ దృశ్యం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మోదీని ఆటపట్టించిన ఖర్గే.. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ
At Pawar family reception:
— Rajat Jain (@RajatJain) August 12, 2026
PM Modi : Shakes Hand with LoP Rahul Gandhi.
PM Modi: Aur Priyanka,Kaisi hai aap?
Priyanka Gandhi: Acchi hu,Aap Kaise hai?
PM Modi: mai vaisa hi hu 😀
Kharge Ji: Vaisa nahi ho, aap thoda sa badal gaye ho 😂💥
PM Modi: accha ? 🤡🤣🤣🤣 pic.twitter.com/DMWPgegHpk