LOADING...
Heavy rains: భారీ వర్షాల ముప్పు.. రైళ్ల భద్రత కోసం రైల్వే శాఖ అత్యవసర సూచనలు జారీ
భారీ వర్షాల ముప్పు.. రైళ్ల భద్రత కోసం రైల్వే శాఖ అత్యవసర సూచనలు జారీ

Heavy rains: భారీ వర్షాల ముప్పు.. రైళ్ల భద్రత కోసం రైల్వే శాఖ అత్యవసర సూచనలు జారీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 13, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో మంగళవారం రాత్రి ప్రారంభమైన వర్షాలు వరద ముప్పును తెచ్చాయి. భారీ వర్షాల కారణంగా పిడుగురాళ్ల-బెల్లంకొండ రైల్వే మార్గంలోని వంతెన నంబర్-59 వద్ద వరద నీరు ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఇదే పరిస్థితి గుంటూరు-తెనాలి మధ్య వంతెన నంబర్-14 వద్ద, అలాగే వెజెండ్ల-మణిపురం మధ్య వంతెన నంబర్-14 వద్ద కూడా ఏర్పడింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, రైల్వే శాఖ అత్యవసర సూచనలు జారీ చేసింది. ఈ మేరకు రైళ్లు ఆ ప్రాంతాల్లో గరిష్టంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడపాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది. పరిస్థితిని రైల్వే సిబ్బంది నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, వరద నీరు తగ్గిన తర్వాత మళ్లీ సాధారణ వేగంతో రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.