Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చంపేస్తామని బెదిరింపులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సంబంధించి అతని పేషీకి బెదిరింపు కాల్స్ రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి"చంపేస్తాం"అంటూ హెచ్చరికలతో ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు,ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషలో మెసేజులు కూడా పంపినట్లు తెలుస్తోంది. పేషీ సిబ్బంది ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఈ బెదిరింపు కాల్స్ గురించి పోలీసు ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు సమాచారం అందించారు. గతంలో కూడా పవన్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో స్వయంగా ఆయనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా మరోసారి ఇలాంటి కాల్స్ రావడం కలకలం సృష్టిస్తోంది.