Tungabhadra Project: తుంగభద్రకు కొత్త గేట్లు.. ముగ్గురు సీఎంల సమక్షంలో ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కర్ణాటకలోని హోస్పేటలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో సంభవించిన భారీ వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. అనంతరం ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ఆవిష్కరణ
#WATCH | Hosapete, Karnataka | Union Jal Shakti Minister C.R. Patil, Karnataka Chief Minister D.K. Shivakumar, Andhra Pradesh CM N. Chandrababu Naidu and Telangana CM A. Revanth Reddy jointly inaugurate 33 newly installed spillway gates of the Tungabhadra Dam today pic.twitter.com/AWHCFPX7Ea
— ANI (@ANI) June 25, 2026