జోధ్‌పూర్‌లో దారుణం; ప్రియుడి ఎదుటే దళిత బాలికపై సామూహిక అత్యాచారం
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ముగ్గురు కళాశాల విద్యార్థులు ఆమె ప్రియుడి ఎదుటే ఓ మైనర్ దళిత బాలిక(17)పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘోరం ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును పోలీసులు వేగంగా విచారించి కొన్ని గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలు తన ప్రియుడి అజ్మీర్‌తో ఇంటి నుంచి పారిపోయి శనివారం జోధ్‌పూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ఓ వసతి గృహానికి వెళ్లారు. అయితే అక్కడ కేర్ టేకర్ వేధించడంతో అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఇదే సమయంలో నిందితులు సమందర్ సింగ్, ధరంపాల్ సింగ్, భాతమ్ సింగ్ అజ్మీర్‌తో పాటు మైనర్ బాలికకు ఆహారం అందించి, వారికి ఉండటానికి ఇల్లును చూపించారు.
మూడు గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు
నిందితులు ఆదివారం తెల్లవారుజామున అజ్మీర్‌తో పాటు మైనర్ బాలికను రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తామని చెప్పి, జేఎన్‌వీయూ పాత క్యాంపస్‌లోని హాకీ గ్రౌండ్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆ ముగ్గురు నిందుతులు బాలిక ప్రియుడిపై దాడి చేశారు. అతని ముందే ఆ బాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక ప్రియుడు క్యాంపస్‌లోని మార్నింగ్ వాకర్ల నుంచి సహాయం కోరాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల్లోనే పోలీసులు నిందితులను జోధ్‌పూర్‌లోని గణేష్‌పురాలోని ఓ ఇంట్లో గుర్తించారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. అలాగే వసతి గృహం కేర్ టేకర్‌ను కూడా అరెస్టు చేసారు. నిందుతులకు ఏబీవీపీతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం.