Page Loader
ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్.. రూ.400 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు 
ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్.. రూ.400 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు

ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్.. రూ.400 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు 

వ్రాసిన వారు Stalin
Oct 31, 2023
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. గత 4రోజుల్లో ముకేష్ అంబానీకి ఇది మూడో మెయిల్ బెదిరింపు కావడం గమనార్హం. ఈ సారి దండగులు రూ. 400 కోట్లను డిమాండ్ చేశారు. గత రెండు మెయిల్స్‌కు స్పందించకపోవడంతో మొత్తాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరైన అంబానీకి అక్టోబర్ 27నుంచి ఒకే ఈమెయిల్ ఐడీ నుంచి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. మొదట శుక్రవారం ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇందులో దుండుగలు రూ.20 కోట్లు డిమాండ్ చేశారు. లేకుంటే చంపేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత రోజు మరో మెయిల్‌ను పంపారు. ఈ సారి రూ.200కోట్లను డిమాండ్ చేశారు. తాజాగా సోమవారం మూడో మెయిల్ వచ్చింది.

మెయిల్

మెయిల్స్ పంపిన వ్యక్తిని షాదాబ్ ఖాన్‌గా గుర్తించిన పోలీసులు

మూడు మెయిల్‌లు ఒకే ఇమెయిల్ ఐడీ నుంచి వచ్చాయని, పంపిన వ్యక్తి షాదాబ్ ఖాన్‌గా గుర్తించామని ముంబై పోలీసులు తెలిపారు. బెల్జియం నుంచి ఈ మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. ఫేక్ ఐడీతో ఈ బెదిరింపు ఈ మెయిల్స్ పంపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఈ-మెయిల్ చిరునామాకు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు బెల్జియన్ ఇమెయిల్ సర్వీస్ ప్రొవైడర్‌లతో మాట్లాడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముకేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు మేరకు గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో మొత్తం మూడు కేసులను పోలీసులు నమోదు చేశారు.