Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. ఆధ్యాత్మికత అంశాల్లో రాజకీయం వద్దన్న సుప్రీంకోర్టు
తిరుపతి లడ్డూ వివాదంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోర్టు తెలిపింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. నెయ్యి నాణ్యతపై ల్యాబ్ రిపోర్టు పరిశీలనలో నిర్ధారణ అయిన విషయాలు, సిట్ దర్యాప్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రకటనలు వంటి అంశాలను కోర్టు ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదికి సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే మీడియా వద్దకు ఎందుకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందని కోర్టు ప్రశ్నించింది.
మత సామరస్యానికి విఘాతం కలిగే ప్రమాదం
విచారణ పూర్తయ్యే వరకు మీడియాకు సమాచారం ఇవ్వకుండా ఉండటం మంచిదని సుప్రీంకోర్టు పేర్కొంది. బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది వాదించారు. ఈ వివాదం భక్తుల మనోభావాలను కించపరిచేలా ఉందని, ఇలాంటి విషయాలను రాజకీయాల్లోకి లాగడం వల్ల మత సామరస్యానికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం మైన జంతువుల కొవ్వు కల్పించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో ఈ వివాదం కోర్టులో సీరియస్‌గా మారింది.