Loading...
Tirumala: తిరుమల జలాశయాల్లో పెరిగిన నీటిమట్టం.. ఐదు డ్యామ్‌ల పూర్తి వివరాలు
తిరుమల జలాశయాల్లో పెరిగిన నీటిమట్టం.. ఐదు డ్యామ్‌ల పూర్తి వివరాలు

Tirumala: తిరుమల జలాశయాల్లో పెరిగిన నీటిమట్టం.. ఐదు డ్యామ్‌ల పూర్తి వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమలలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తుల తాగునీరు,ఇతర అవసరాలకు ఆధారమైన ఐదు ప్రధాన డ్యామ్‌లలోకి కొత్తగా నీరు చేరుతోంది. శుక్రవారం నాటికి పాపవినాశనం,గోగర్భం,ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాల్లోకి మొత్తం 61.68 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా వచ్చి చేరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) జలమండలి అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నాటి గణాంకాల ప్రకారం.. ఐదు జలాశయాల్లోకి వచ్చిన నీటిలో 21.60 లక్షల గ్యాలన్లను వివిధ అవసరాలకు వినియోగించారు. వినియోగం పోగా మరో 40.08 లక్షల గ్యాలన్ల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో జలాశయంలో నీటి నిల్వలు, రోజువారీ వినియోగానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాలు 

పాపవినాశనం డ్యామ్

తిరుమలలో అతిపెద్ద జలాశయమైన పాపవినాశనం డ్యామ్ పూర్తి నిల్వ సామర్థ్యం 5,240 లక్షల గ్యాలన్లు. గత రోజు వరకు ఈ జలాశయంలో 2,667.39 లక్షల గ్యాలన్ల నీరు ఉండగా, ప్రస్తుతం 2,688.35 లక్షల గ్యాలన్లకు చేరింది.

దీంతో 20.96 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా వచ్చి చేరింది. ఇందులో రోజువారీ అవసరాలకు 14.10 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించగా, 6.86 లక్షల గ్యాలన్ల నీరు మిగిలింది.

వివరాలు 

గోగర్భం డ్యామ్

గోగర్భం జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 2,833.10 లక్షల గ్యాలన్లు. గత రోజు వరకు 499.06 లక్షల గ్యాలన్ల నీరు ఉండగా, ప్రస్తుతం 508.31 లక్షల గ్యాలన్లకు చేరింది.

ఈ జలాశయంలోకి 9.25 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా వచ్చింది.

రోజువారీ అవసరాల కోసం 7.50 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించగా, మిగిలిన నీరు 1.75 లక్షల గ్యాలన్లుగా నమోదైంది.

ఆకాశగంగ డ్యామ్

పవిత్రమైన ఆకాశగంగ జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు.

గత రోజు వరకు ఈ డ్యామ్‌లో 24.07 లక్షల గ్యాలన్ల నీరు ఉండగా, ప్రస్తుతం 30.40 లక్షల గ్యాలన్లకు పెరిగింది.

దీంతో 6.33 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరింది.

ADVERTISEMENT

వివరాలు 

కుమారధార డ్యామ్

శుక్రవారం రోజువారీ వినియోగం ఏమీ లేకపోవడంతో మొత్తం 6.33 లక్షల గ్యాలన్ల నీరు నిల్వగా ఉంది. ఈ ప్రాంతంలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కుమారధార జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 4,259.01 లక్షల గ్యాలన్లు.

గత రోజు వరకు 338.84 లక్షల గ్యాలన్ల నీరు ఉండగా, ప్రస్తుతం 363.98 లక్షల గ్యాలన్లకు చేరింది.

ఈ జలాశయంలోకి 25.14 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా వచ్చింది. ఆ రోజు నీటి వినియోగం లేకపోవడంతో వచ్చిన నీరంతా నిల్వలోనే ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

పసుపుధార డ్యామ్

పసుపుధార జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 1,287.54 లక్షల గ్యాలన్లు. గత రోజు, ప్రస్తుత నిల్వలు రెండూ 24.38 లక్షల గ్యాలన్లుగానే నమోదయ్యాయి.

ఈ జలాశయంలోకి కొత్తగా నీరు చేరలేదు. రోజువారీ వినియోగం కూడా లేకపోవడంతో నీటి నిల్వలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.

ఒకే రోజు 61.68 లక్షల గ్యాలన్ల నీరు రాక

ఐదు జలాశయాల్లోకి ఒకే రోజులో మొత్తం 61.68 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరింది.

ఇందులో 21.60 లక్షల గ్యాలన్లను వివిధ అవసరాలకు వినియోగించగా, 40.08 లక్షల గ్యాలన్ల నీరు మిగిలింది.

ముఖ్యంగా కుమారధార, పాపవినాశనం జలాశయాల్లోకి ఎక్కువ మొత్తంలో నీరు చేరడం గమనార్హం.

వివరాలు 

బ్రహ్మోత్సవాల సమయంలోనూ పెరిగిన నీటి నిల్వలు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల జలాశయాల్లోకి అదనంగా 7.02 లక్షల గ్యాలన్ల నీరు చేరింది.

నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో 148.48 లక్షల గ్యాలన్ల నీరు వచ్చి చేరింది.

అక్టోబర్ 23వ తేదీ నాటికి తిరుమలలోని జలాశయాల్లోకి మొత్తం 244.46 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో డ్యామ్‌లలోకి నీటి ప్రవాహం పెరిగింది.

ఫలితంగా జలాశయాల్లో నీటిమట్టాలు మెరుగుపడ్డాయి.

ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతపై ఆందోళనలు ఉన్న సమయంలో జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడం అధికారులతో పాటు భక్తుల్లోనూ సంతోషాన్ని కలిగిస్తోంది.

ADVERTISEMENT