Loading...
Tirumala Water Crisis: తిరుమలకు ఎల్‌నినో ఎఫెక్ట్‌...అప్రమత్తమైన టీటీడీ
తిరుమలకు ఎల్‌నినో ఎఫెక్ట్‌...అప్రమత్తమైన టీటీడీ

Tirumala Water Crisis: తిరుమలకు ఎల్‌నినో ఎఫెక్ట్‌...అప్రమత్తమైన టీటీడీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 19, 2026
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎండల తీవ్రత, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవచ్చన్న అంచనాల మధ్య జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు సుమారు 120 రోజుల అవసరాలకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే నెలల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే నీటి పొదుపు చర్యలు ప్రారంభించారు.

Details

రోజుకు 60 లక్షల గ్యాలన్ల అవసరం

తిరుమలలో భక్తుల రద్దీని బట్టి రోజుకు 50 నుంచి 60 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది.

ఇందులో సగం పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాల నుంచి అందుతోంది.

మిగిలిన నీటిని తిరుపతి సమీపంలోని కల్యాణి డ్యామ్‌ నుంచి సరఫరా చేస్తున్నారు.

గతంలో కురిసిన వర్షాలు కొంత ఊరటనిచ్చినా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ వినియోగంపై నియంత్రణ విధించింది.

Details

హోటళ్లు, మఠాలకు నీటి సరఫరాపై పరిమితి

నీటి పొదుపులో భాగంగా తిరుమలలోని ప్రైవేటు హోటళ్లు, మఠాలు, వాణిజ్య సముదాయాలకు సరఫరా చేసే నీటిపై పరిమితులు విధించారు.

ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మాత్రమే నీటిని అందిస్తున్నారు.

అవసరమైతే ప్రైవేటు హోటళ్లు తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తుల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ADVERTISEMENT

Details

ప్రత్యామ్నాయ నీటి వనరులపైనా దృష్టి

రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండితే 18 నెలల వరకు నీటి సమస్య ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు.

వర్షాలు తక్కువగా పడితే కల్యాణి డ్యామ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ వనరుల నుంచి నీటిని తీసుకొచ్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు జలాశయాల్లో పూడికతీత, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పైపులైన్ల లీకేజీల నివారణపైనా టీటీడీ దృష్టి సారిస్తోంది.

ADVERTISEMENT