
బిహార్: నితీష్ ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం.. కుల గణన ఫలితాలపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
కుల గణన సర్వే ఫలితాలను ప్రకటించిన బిహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.
అయితే ఆ ఫలితాలపై చర్చించేందుకు మంగళవారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
కుల గణన సర్వే ఫలితాలను నితీష్ కుమార్ అఖిలపక్షానికి వివరిస్తారు. ఈ సందర్భంగా తదుపరి కార్యచరణపై చర్చిస్తారు.
రాష్ట్రంలోని 13.1కోట్ల మంది జనాభాలో 36శాతం మంది అత్యంత వెనుకబడిన తరగతులు, 27.1శాతం వెనుకబడిన తరగతులకు, 19.7శాతం షెడ్యూల్డ్ కులాలు, 1.7శాతం షెడ్యూల్డ్ తెగలు, జనరల్ కేటగిరీకి చెందిన వారు 15.5శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
రాష్ట్రంలో ఓబీసీలు జనాభా 63శాతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఓబీసీల్లో అత్యధికంగా ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సామాజిక వర్గానికి చెందిన యాదవ్‌లు 14.27శాతంతో అత్యధికంగా ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బిహార్‌లో 63శాతం ఓబీసీలు
Bihar Chief Minister Nitish Kumar has called for an all-party meeting on Tuesday #CasteCensus https://t.co/xkHpG2QFq2
— IndiaToday (@IndiaToday) October 2, 2023