Loading...
Pune: పర్యాటకుల దుస్తులపై అభ్యంతరం.. సింహగడ్ కోటలో దాడి, వీడియోలు వైరల్
పర్యాటకుల దుస్తులపై అభ్యంతరం.. సింహగడ్ కోటలో దాడి, వీడియోలు వైరల్

Pune: పర్యాటకుల దుస్తులపై అభ్యంతరం.. సింహగడ్ కోటలో దాడి, వీడియోలు వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

పూణే సమీపంలోని చారిత్రక సింహగడ్ కోటలో పర్యాటకులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పొట్టి దుస్తులు,స్లీవ్‌లెస్ బట్టలు ధరించారంటూ ఓ మహిళ సహా నలుగురుపర్యాటకులను అడ్డుకుని వారిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. 'సమస్త్ హిందూ బంధవ్ ఆర్మీ'కి చెందిన కొందరు సభ్యులు కోటలోని తానాజీ మలుసరే స్మారకం వద్ద పర్యాటకులను నిలువరించినట్లు సమాచారం. షార్ట్స్ ఎందుకు ధరించారంటూ ప్రశ్నిస్తూ,హిందూ సంస్కృతి గురించి ప్రస్తావించి వారితో వాగ్వాదానికి దిగిన అనంతరం దాడి చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

వివరాలు 

నిమిదేళ్ల బాలిక బెర్ముడా ధరించడంపైనా అభ్యంతరం

ఓ బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో..ముగ్గురు వ్యక్తులు తనపై దాడి చేశారని,మరో మహిళ తన భార్యను పక్కకు లాగి కింద పడేసిందని ఆరోపించారు.

ఇదే సమయంలో మరో మూడు పర్యాటక బృందాలు కూడా ఇలాంటి వేధింపులకు గురైనట్లు ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా ఎనిమిదేళ్ల బాలిక బెర్ముడా ధరించడంపైనా కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ ఘటనపై హవేలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సంకేత్ సంజయ్ పాటిల్, ఆశిష్ దిలీప్ అపర్ సహా మొత్తం ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దాడి, అల్లర్లు, చట్టవిరుద్ధంగా గుమిగూడటం, నేరపూరిత బెదిరింపులు వంటి అభియోగాలను వారిపై నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

షార్ట్స్ వేసుకున్నారని పర్యాటకులపై దాడి

ADVERTISEMENT