హైదరాబాద్: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 90రోజులుగా ట్రాఫిక్ ఆంక్షలు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో 2023 మార్చి 28 నుంచి జూలై 28 వరకు 90 రోజుల పాటు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌లో పరిధిలోని ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాలా పునర్నిర్మాణ పనుల దృష్ట్యా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని పలు సెక్షన్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు.
వాహనాలు మళ్లించే రూట్లను వెల్లడించిన పోలీసులు
కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనదారులు కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకొని ఐడీఎల్ లేక్ రోడ్ - గ్రీన్ హిల్స్ రోడ్ - రెయిన్‌బో విస్టాస్ - ఖైత్లాపూర్ ఫ్లైఓవర్ -పార్వత్‌నగర్ - టోడీ కాంపౌండ్ వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు. కూకట్‌పల్లి నుంచి బేగంపేట వైపు వచ్చే ప్రయాణికులు కూకట్‌పల్లి వై జంక్షన్ - బాలానగర్ ఫ్లైఓవర్ - న్యూ బోవెన్‌పల్లి జంక్షన్ రైట్ టర్న్ - తాడ్‌బండ్ రైట్ టర్న్ - ప్యారడైజ్ జంక్షన్-బేగంపేట ఫ్లైఓవర్ వద్ద మళ్లించాలని సూచించారు. బాలానగర్ నుంచి వచ్చే వారు, కూకట్‌పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వైపు వచ్చే ప్రయాణికులు బాలానగర్ ఫ్లైఓవర్ కింద మళ్లించాలని పేర్కొన్నారు.