Page Loader
తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం
నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం

వ్రాసిన వారు Stalin
Mar 23, 2023
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను గురువారం సీఎం కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పరిశీలించారు. తొలుత ఖమ్మ జిల్లా రామాపురం, గార్లపాడు గ్రామాల్లో పొలాలను స్వయంగా సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. బోనకల్ మండలం రావినూతల గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లి, అక్కడ కూడా పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,28,255 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు.

సీఎం కేసీఆర్

1,29, 446 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం: సీఎం కేసీఆర్

నష్టపోయిన రైతులను అండగా ఉంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. 1,29, 446 ఎకరాల్లో మొక్కజొన్న, 72, 709 ఎకరాల్లో వరి, 8865 ఎకరాల్లో మామిడ పంటలకు నష్టం వాటిల్లినట్లు సీఎం చెప్పారు. ఈ సందర్భంగా రైతులు అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అనుకూలమైన పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం పర్యటన మూగిసిన తర్వాత అక్కడి నుంచి మహబూబాబాద్, కరీంనగర్ పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ బయలుదేరారు.