
ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ల లీకేజీ వల్ల ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి.
దీంతో ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అవసరమైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను రద్దే చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డిని ప్రగతి భవన్ రావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో ప్రగతి భవన్ లో మంత్రులు, జనార్ధన్‌రెడ్డి సహా ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీఎస్‌పీఎస్సీ
సిట్ నివేదికలో సంచలన నిజాలు
మొదట్లో ఒకటి లేదా రెండు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు అందురూ అనుకున్నారు. కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే గ్రూప్-1 ప్రిలిమ్స్ తోపాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
ఇంకా అనేక సంచలన విషయాలు విచారణలో తేలడంతో దీనిపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకునేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. అందుకే శనివారం ప్రగతి భవవ్‌లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఏఈఈ, డీఏఓ పరీక్షల తేదీలను ఇంకా వెల్లడించలేదు.