టీఎస్‌పీఎస్‌సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్!
ఈ వార్తాకథనం ఏంటి
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి అపహరించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) గుర్తించినట్లు తెలుస్తోంది.
అయితే దీని మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు టీఎస్‌పీఎస్‌సీ అధికారులతో సిట్ బృందం భేటీ అయ్యింది. ప్రవీణ్‌కు కంప్యూటర్ పాస్ వర్డ్ ఎలా లభించింది? అతనికి ఇంకా ఎవరైనా సాయం చేశారా అనే కోణంలో సిట్ అధికారులు ఆరా తీశారు.
టీఎస్‌పీఎస్‌సీ
పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్‌కు రాజశేఖర్ సాయం
అయితే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్‌కు రాజశేఖర్ సాయం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో ప్రవీణ్ చోరీ చేసిన 5పేపర్లలో మార్చిన 5 జరిగే పరీక్షతో పాటు మరో నాలుగు పేపర్లు ఉన్నట్లు సిట్ అధికారులు కనుగొన్నారు.
ప్రధానంగా టౌన్ ప్లానింగ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్, బిల్డింగ్ ఓవర్సిస్ పేపర్, వెటర్నరీ పేపర్ లీకైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.