ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్
ఎల్‌బీ నగర్ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఎల్‌బీ నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ మంత్రి కేటీ రామారావు శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద రూ.32 కోట్లతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది. ఈ ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి రావడం వల్ల ట్రాఫిక్ రద్దీని చాలా వరకు తగ్గుతుందని నగర ప్రజలు భావిస్తున్నారు. 700మీటర్ల పొడవు, 12అడుగుల వెడల్పు, మూడు లేన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఖమ్మం, నల్గొండ, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తుంది. ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జీహెచ్‌ఎంసీలోనే సిగ్నల్ ఫీ జంక్షన్‌గా ఇది నిలనుంది.