తదుపరి వార్తా కథనం
Railway Worker : బరౌనీ రైల్వే జంక్షన్‌లో విషాదం.. ఇంజిన్, కోచ్ మధ్య చిక్కుకొని కార్మికుడి మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 09, 2024
04:48 pm
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 5లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
విధులు నిర్వహిస్తుండగా రైల్వే పోర్టర్ అమర్ కుమార్ రైలు ఇంజిన్, కప్లింగ్‌ను విడదీసే ప్రయత్నంలో బోగీల మధ్య నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఉదయం లఖ్‌నవూ-బరౌనీ ఎక్స్‌ప్రెస్ రైలు (15204) ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అమర్ కుమార్ కప్లింగ్‌ను విడదీస్తుండగా, ఇంజిన్ రివర్స్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రయాణికులు కేకలు వేస్తున్నా, లోకోపైలట్ ఇంజిన్‌ను ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడే ఉన్న కొంతమంది ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డ్ చేశారు.
రైల్వే అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.