Loading...
Mount Elbrus: ఎల్‌బ్రస్‌ శిఖరంపై త్రివర్ణ పతాకం.. ఆంధ్రా పోలీస్‌ అధికారి ఘనత
ఎల్‌బ్రస్‌ శిఖరంపై త్రివర్ణ పతాకం.. ఆంధ్రా పోలీస్‌ అధికారి ఘనత

Mount Elbrus: ఎల్‌బ్రస్‌ శిఖరంపై త్రివర్ణ పతాకం.. ఆంధ్రా పోలీస్‌ అధికారి ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు. ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వెంకటేశ్వరరావు యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన 'మౌంట్‌ ఎల్‌బ్రస్‌ను' అధిరోహించి అక్కడ జాతీయ జెండాను ఎగురవేశారు. శనివారం ఉదయం 8 గంటలకు భారత కాలమానం ప్రకారం రష్యాలోని మౌంట్‌ ఎల్‌బ్రస్‌ శిఖరాన్ని వెంకటేశ్వరరావు చేరుకున్నారు. అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడంతో పాటు 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.

వివరాలు

యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా గుర్తింపు

ఈ సందర్భంగా తన విజయాన్ని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి అంకితం చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.

5,642 మీటర్ల ఎత్తు ఉన్న మౌంట్‌ ఎల్‌బ్రస్‌ రష్యాలో ఉంది. యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా దీనికి గుర్తింపు ఉంది.

ఎల్‌బ్రస్‌ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన వెంకటేశ్వరరావు.. ఇక తన తదుపరి లక్ష్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలని నిర్ణయించుకోవడం విశేషం.

ADVERTISEMENT