TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్..
ఈ వార్తాకథనం ఏంటి
కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనం ఇచ్చే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది.
కానీ, ఇటీవల తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ సరైన గుర్తింపు ఇవ్వడంలో కొంత వివాదం చోటుచేసుకుంది.
ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ స్వీకరించకపోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది.
టీటీడీ, తెలంగాణ ప్రాతినిధుల సిఫారసు లేఖలు చెల్లవని వివరణ ఇచ్చినప్పుడు, దీనిపై తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
వారానికి రెండు సార్లు సిఫారసు లేఖలు
అయితే, ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఈ వివాదం మీద కీలక నిర్ణయం తీసుకుంది.
బోర్డులోని మెజారిటీ సభ్యులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరడంతో, టీటీడీ ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.
ఇక, తెలంగాణ ప్రజాప్రతినిధులకు వారానికి రెండు సార్లు సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
ఈ ప్రకటన నేపథ్యంలో, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.
ఇక నుండి వారానికి రెండు సార్లు రూ.300 విలువైన దర్శనానికి సిఫారసు లేఖలు ఇచ్చేందుకు అంగీకరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నిర్ణయం, తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్తగా మారింది.