Loading...
Tungabhadra: పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం.. 87.45 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం.. 87.45 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

Tungabhadra: పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం.. 87.45 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తుంగభద్ర జలాశయంలోకి వరద నీటి చేరిక కొనసాగుతోంది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 87.45 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం నీటిమట్టం 1,628.20 అడుగులకు చేరుకుంది. గత 24 గంటల్లో సగటున 26,834 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. ప్రస్తుతం 23,290 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మరోవైపు జలాశయం నుంచి వివిధ కాలువలకు 2,226 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి భారీగా నీరు చేరుతుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

వివరాలు 

త్రివర్ణ శోభితం..!

స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందే తుంగభద్ర జలాశయం కొత్త శోభను సంతరించుకుంది.

జలాశయం నూతన క్రస్ట్‌గేట్లను మూడు రంగుల విద్యుత్‌ కాంతులతో అలంకరించారు.

త్రివర్ణ కాంతులతో మెరిసిపోతున్న క్రస్ట్‌గేట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఏడాది తుంగభద్ర జలాశయంలోకి ప్రస్తుతం భారీగా నీరు చేరుతోంది.

దీంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జలాశయాన్ని సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

ఆగస్టు 15న జలాశయాన్ని తిలకించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టినట్లు బోర్డు అధికారులు తెలిపారు.

ADVERTISEMENT