Page Loader
రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా
రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా

రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా

వ్రాసిన వారు Stalin
May 26, 2023
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత రెండు వారాల్లో రెండు దేశాల్లో పర్యటనను పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈపర్యటనలో భాగంగా 80కి పైగా వ్యాపార సమావేశాలు, 42,000 ఉద్యోగావకాశాలను కల్పించేలా కేటీఆర్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూకే, అమెరికా దేశాల్లో కంపెనీలతో సమావేశమై తెలంగాణలోని టైర్ IIనగరాల్లో కూడా పెట్టుబడులను ఆకర్షించింది. తద్వారా తెలంగాణలో ఇతర పట్టణాల్లో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ పర్యటనలో కేటీఆర్ 30కి పైగా కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. నల్గొండ ఐటీ హబ్‌లో 200ఉద్యోగాలతో షాప్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సొనాటా సాఫ్ట్‌వేర్ ప్రకటించడంతో హైదరాబాద్‌కు ఆవల ఐటీ కార్యకలాపాలను ప్రారంభించే సంకేతాలను ఇచ్చారు.

తెలంగాణ

తెలంగాణను పెట్టుబడి గమ్యస్థానంగా మరోసారి చాటిన కేటీఆర్

కరీంనగర్‌లో కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభించనున్న 3M-ECLAT నుంచి మరో ప్రకటన వచ్చింది. అలాగే రైట్ సాఫ్ట్‌వేర్ సమీప భవిష్యత్తులో వరంగల్‌కు కార్యకలాపాలను విస్తరించడానికి ఆసక్తిని చూపుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఈటీ, ఐటీఈఎస్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్, డేటా సెంటర్, ఆటోమోటివ్, ఈవీఇతర రంగాల్లో మంత్రి కేటీఆర్ బృందం పెట్టుబడులను ఆకర్షించింది. తద్వారా తెలంగాణను పెట్టుబడి గమ్యస్థానంగా మరోసారి ప్రపంచ వేదికపై పునరుద్ఘాటించారు.