Page Loader
UGC: భారతీయ విశ్వవిద్యాలయాలలో ద్వివార్షిక ప్రవేశాలకు ఆమోదం తెలిపిన UGC 
భారతీయ విశ్వవిద్యాలయాలలో ద్వివార్షిక ప్రవేశాలకు ఆమోదం తెలిపిన UGC

UGC: భారతీయ విశ్వవిద్యాలయాలలో ద్వివార్షిక ప్రవేశాలకు ఆమోదం తెలిపిన UGC 

వ్రాసిన వారు Stalin
Jun 11, 2024
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో భారతీయ విశ్వవిద్యాలయాలు,ఉన్నత విద్యాసంస్థలు ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు అనుమతించామని UGC చీఫ్ జగదీష్ కుమార్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం నుండి రెండు అడ్మిషన్ సైకిల్స్ జూలై-ఆగస్టు , జనవరి-ఫిబ్రవరి ఉంటాయి."భారతీయ విశ్వవిద్యాలయాలు సంవత్సరానికి రెండుసార్లు అడ్మిషన్‌ను అందించగలిగితే, బోర్డు ఫలితాల ప్రకటనలో జాప్యం, వ్యక్తిగత సమస్యలు వుండవన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల జూలై-ఆగస్టు సెషన్‌లో విశ్వవిద్యాలయంలో అడ్మిషన్‌ను కోల్పోయిన అనేక మంది విద్యార్థులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని " కుమార్ పిటిఐకి తెలిపారు. ఈ ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ లో వుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ కొత్త ప్రణాళికకు తాజాగా ఆమోదం తెలిపింది.

వివరాలు 

HEIలు మెరుగైన పని తీరు కనపరిచే అవకాశాలు 

ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌ను కోల్పోయినట్లయితే వారు మరో వరకు సంవత్సరం పూర్తి కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ద్వివార్షిక అడ్మిషన్లు అమలులో ఉండటంతో, పరిశ్రమలు తమ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లను సంవత్సరానికి రెండుసార్లు చేయవచ్చు. గ్రాడ్యుయేట్‌లకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయి అన్నారు UGC చీఫ్ . ద్వివార్షిక అడ్మిషన్‌లు ఉన్నత విద్యా సంస్థలు (HEIలు) ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, క్లాస్‌రూమ్‌లు , సపోర్ట్ సర్వీసెస్ వంటి వనరుల పంపిణీని మరింత సమర్ధవంతంగా ప్లాన్ చేసుకోగలవని జగదీష్ కుమార్ అభిప్రాయపడ్డారు.

వివరాలు 

యూనివర్సిటీలో మెరుగైన పని తీరు

ఫలితంగా యూనివర్సిటీలో మెరుగైన పని తీరు కనపరుస్తాయని UGC చీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ద్వివార్షిక అడ్మిషన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. భారతీయ HEIలు ద్వివార్షిక అడ్మిషన్ సైకిల్‌ను అవలంబిస్తే, మా HEIలు వారి అంతర్జాతీయ సహకారాన్ని విద్యార్థుల మార్పిడిని మెరుగుపరుస్తాయి. ఫలితంగా, మా ప్రపంచ పోటీతత్వం మెరుగుపడుతుందన్నారు. తద్వారా భారతీయ విద్యార్ధులు సైతం మేము ప్రపంచ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటారని జగదీష్ కుమార్ చెప్పారు.