Page Loader
Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌
రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌

Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2024
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో రైతులకు మేలు చేసే ఉద్దేశ్యంతో ఖరీఫ్ సీజన్ నుండి సన్న వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ సీజన్‌లో సేకరించిన ధాన్యాన్ని జనవరి నుండి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం రూపంలో పంపిణీ చేయనున్నామని వివరించారు. మొత్తం 3 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున అందించనున్నారని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని కొంటామని ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పంట కొనుగోలు పై జేసీలు, పౌర సరఫరాల అధికారులు, మేనేజర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.

వివరాలు 

 అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇవ్వరు: ఉత్తమ్ 

ఖరీఫ్ సీజన్‌లో 60.39 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని, దాదాపు 146.28 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇందులో 91.28 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్నాలు 36.80 లక్షల ఎకరాల్లో సాగు చేయబడగా, 88.09 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇవ్వడం జరగదు. సరిహద్దు రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యంపై కఠినమైన నిఘా పెట్టాలని మంత్రి సూచించారు.

వివరాలు 

అక్టోబరు తొలివారం నుంచి కొనుగోళ్లు 

ఖరీఫ్‌ సీజన్‌ కోసం 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పనున్నాము. సన్న, దొడ్డు రకాలు వడ్ల కొరకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తాము. సహకార సంఘాల ద్వారా 4,496, ఐకేపీ ద్వారా 2,102, మరియు ఇతర మార్గాలు ద్వారా 541 కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. అక్టోబరు తొలివారంలో ప్రారంభమయ్యే ధాన్యం కొనుగోళ్లు జనవరి నెలాఖరు వరకు కొనసాగుతాయి. అక్టోబరు తొలివారంలో నల్గొండ,మెదక్‌లో, రెండవ వారంలో నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలలో సేకరణ ప్రారంభమవుతుంది. మూడవ వారంలో కరీంనగర్, జగిత్యాల, వరంగల్, జనగామ, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో సేకరణ జరగనుంది. నాలుగవ వారంలో మంచిర్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో కొనుగోళ్లు సేకరణ మొదలవుతుంది.

వివరాలు 

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఉత్తమ్ 

నవంబరు మొదటి వారంలో నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి, రెండవ వారంలో కుమురంభీం, భద్రాద్రి, గద్వాల, వనపర్తి, మూడవ వారంలో భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నాలుగవ వారంలో మహబూబాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్‌లలో కొనుగోళ్లు జరగనున్నాయి. తొ లిసారిగా 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వకు గోదాములను సిద్ధం చేసాము. ధాన్యం సేకరణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.