LOADING...
ఉత్తరాఖండ్​లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్
హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్

ఉత్తరాఖండ్​లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 18, 2023
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్యటనలో ఓ పోలీస్ ఉన్నతాధికారిపై వేటు పడింది. సెల్ ఫోన్‌ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్‌ చేసినందుకు పోలీస్ శాఖ ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్​లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రవహించిన నదులు, వంతెనలను ముంచెత్తాయి. జన జీవనం స్థంభించిపోయింది. రోడ్లు మీద వరద నీటితో రాకపోకలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ మేరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 11న వరద ప్రభావిత ప్రాంతాల(కోట్‌ద్వార్‌) సందర్శనార్థం సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి నడుం బిగించారు.

DETAILS

సీఎం హెలికాఫ్టర్‌ దిగిన సమయంలో ఫోన్‌లో  మాట్లాడుతున్న ఏఎస్పీ  

ఉత్తరాఖండ్​లో పౌరీ గర్వాల్ జిల్లా కోట్‌ద్వార్‌ లో సీఎం ధామి పర్యటించాారు. ఇదే సమయంలో అదనపు ఎస్పీ శేఖర్ సుయాల్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సీఎం హెలికాప్టర్ రాకను గుర్తించి అధికార యంత్రాంగం హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంది. ఈ క్రమంలోనే సీఎం హెలికాఫ్టర్‌ దిగిన సమయంలో సదరు ఏఎస్పీ ఫోన్‌లో సంభాషిస్తున్నాడు.ఒక చేత్తో ఫోన్‌ను చెవిలో పెట్టుకుని, మరో చేత్తో ముఖ్యమంత్రికి సెల్యూట్‌ చేశారు. ఘటనపై వెంటనే పోలీస్ బాసులు ఏఎస్పీపై క్రమశిక్షణా చర్యల కింద వేటు చేశారు. నరేంద్రనగర్‌లోని పోలీస్‌ ట్రైనింగ్ సెంటర్ కు బదిలీ చేశారు. ఈ మేరకు జై బలూనిని ఏఎస్పీగా నియమించారు.కోట్‌ద్వార్‌ లో వరద నీరు గ్రామాల్లోకి చేరడంతో చాలా ఇళ్లు బురదలో కూరుకుపోయిన కారణంగా సీఎం పర్యటిస్తున్నారు.