TTD: వైకుంఠ ఏకాదశి.. ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల ఆధారంగాను దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఈనెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా భక్తుల భారీ సంఖ్యలో రాకను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్టు బుధవారం మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసిందని పేర్కొన్నారు.
జనవరి 10న ఉదయం 4.30 గంటలకే ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
Details
టికెట్లు లేని భక్తులకు వైకుంఠ దర్శనాలకు అనుమతి ఉండదు
ఆ తర్వాత 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు కలిగిన భక్తులకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
తిరుపతిలోని ప్రత్యేక టోకెన్ల జారీ కేంద్రాల ద్వారా మాత్రమే ఈ టోకెన్లు అందుబాటులో ఉంటాయని, టోకెన్ల లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం ఉండదని తెలిపారు.
భక్తుల ఈ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, ఇందుకోసం టీటీడీ పటిష్టమైన చర్యలు చేపట్టిందని చెప్పారు.