LOADING...
Video:పూణె హత్య కేసు: పోలీసుల సమక్షంలో సియా అసభ్య సైగలు.. వీడియో వైరల్
పూణె హత్య కేసు: పోలీసుల సమక్షంలో సియా అసభ్య సైగలు.. వీడియో వైరల్

Video:పూణె హత్య కేసు: పోలీసుల సమక్షంలో సియా అసభ్య సైగలు.. వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో నిలిచింది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా పోలీసులు ఆమెను పూణెలోని నివాసం నుంచి బయటకు తీసుకువస్తుండగా, అక్కడ ఉన్న మీడియా ప్రతినిధుల వైపు మధ్యవేలు చూపిస్తూ అసభ్య సైగ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. సియా ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

వివరాలు 

పాలిగ్రాఫ్‌ టెస్ట్‌కూ అనుమతి కోరే అవకాశం

ఇదిలా ఉండగా, ఈ కేసులో నిందితులైన చేతన్, సియా రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరినీ మరికొన్ని రోజుల పాటు రిమాండ్‌లో ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు నేడు కోర్టును కోరనున్నారు. అదే సమయంలో, కేతన్‌ను లోయలోకి తోసి హత్య చేశారని స్పష్టంగా నిరూపించే ప్రత్యక్ష ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేసులో మరిన్ని వివరాలు వెలికితీయడానికి నిందితులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోర్టును అభ్యర్థించనున్నట్లు సమాచారం.

వివరాలు 

నవంబర్‌లో సియా గోయల్, కేతన్ అగర్వాల్ వివాహం

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఈ ఏడాది నవంబర్‌లో సియా గోయల్, కేతన్ అగర్వాల్ వివాహం జరగాల్సి ఉంది. అయితే తమ సంబంధానికి కేతన్ అడ్డుగా ఉన్నాడని భావించిన సియా, చేతన్‌తో కలిసి జూన్ 18న కేతన్ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా, జూన్ 14న కూడా కేతన్‌ను లోయలోకి తోసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పూణె హత్య కేసు: సియా అసభ్య సైగలు వైరల్..

Advertisement