Loading...
Vijayawada: భారీ వర్షంతో విజయవాడ అతలాకుతలం.. స్తంభించిన రాకపోకలు
భారీ వర్షంతో విజయవాడ అతలాకుతలం.. స్తంభించిన రాకపోకలు

Vijayawada: భారీ వర్షంతో విజయవాడ అతలాకుతలం.. స్తంభించిన రాకపోకలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2026
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడలో శనివారం కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. బందరు, ఏలూరు రోడ్లపై పలు ప్రాంతాల్లో నడుములోతు వరకు నీరు చేరింది. బెంజ్‌ సర్కిల్, పీఎన్‌బీఎస్‌ బస్టాండ్‌ ప్రాంతం, మొగల్రాజపురం, ఎన్టీఆర్‌ సర్కిల్‌ సహా నగరంలోని కీలక ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన అనంతరం నగరపాలక సంస్థ అధికారులు మోటార్లను ఏర్పాటు చేసి రోడ్లపై నిలిచిన నీటిని తోడించారు.

వివరాలు

విమాన సర్వీసులకు అంతరాయం

భారీ వర్షం, వరద తీవ్రత కారణంగా కాలనీల్లోని రహదారులు సైతం పలు చోట్ల నీటిలో మునిగిపోయాయి.

మరోవైపు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులకు కూడా వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది.

ఉదయం బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సిన 6ఈ7204 ఇండిగో సర్వీసు రద్దయింది. అలాగే చెన్నై నుంచి రావాల్సిన 6ఈ7084 సర్వీసును రాజమహేంద్రవరానికి దారి మళ్లించారు.

అనంతరం వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో విజయవాడ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్‌కు అనుమతించారు. విశాఖపట్నం, కడపకు వెళ్లే ఇండిగో సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.

వివరాలు

ప్రజల్ని అప్రమత్తం చేయాలి: పవన్‌ కళ్యాణ్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ మేరకు పవన్‌కల్యాణ్‌ శనివారం జిల్లా కలెక్టర్‌తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు.

ADVERTISEMENT

వివరాలు

నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం విదర్భ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈ అల్పపీడనం ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురంలో అత్యధికంగా 79.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు

కొట్టుకుపోయిన కల్వర్టు.. 15 గ్రామాలకు ఆగిన రాకపోకలు

భారీ వర్షాల కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని ధారకొండ పంచాయతీ చిన గంగవరం వద్ద వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక కల్వర్టు శనివారం తెల్లవారుజామున కొట్టుకుపోయింది.

తాత్కాలిక కల్వర్టు కొట్టుకుపోవడంతో 15 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ADVERTISEMENT