Loading...
Mamata Banerjee: కోర్టు షరతుల ఉల్లంఘన.. మమతా బెనర్జీపై పోలీసుల కేసు
కోర్టు షరతుల ఉల్లంఘన.. మమతా బెనర్జీపై పోలీసుల కేసు

Mamata Banerjee: కోర్టు షరతుల ఉల్లంఘన.. మమతా బెనర్జీపై పోలీసుల కేసు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 29, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హైకోర్టులో షాక్ ఎదురైంది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందుకు ఆమెపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి కలకత్తా హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ కోల్‌కతా పోలీసులు శనివారం సుమోటోగా కేసు నమోదు చేశారు. మమతా బెనర్జీతో పాటు తృణమూల్ ఛాత్ర పరిషత్ (TMCP) సమావేశ నిర్వాహకులపై హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్న ఆరోపణల ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు

వివరాలు

సమావేశ నిర్వాహకులపై కూడా కేసు నమోదు

. కోర్టు షరతుల ఉల్లంఘనలో ప్రమేయం ఉన్న వారందరి పాత్రను దర్యాప్తు సందర్భంగా పరిశీలిస్తామని పోలీసు అధికారి వెల్లడించారు.

సెంట్రల్ కోల్‌కతాలోని కేథడ్రల్ రోడ్‌లో జరిగిన సమావేశానికి సంబంధించి కోర్టు విధించిన షరతులను పోలీసులు పరిశీలించారు.

అనంతరం మమతా బెనర్జీ, సమావేశ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ADVERTISEMENT