Loading...
Omar Abdullah: 'కశ్మీరీలు జైలులో ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందా?'.. కాంగ్రెస్‌పై ఒమర్‌ అబ్దుల్లా ఫైర్
కాంగ్రెస్‌పై ఒమర్‌ అబ్దుల్లా ఫైర్

Omar Abdullah: 'కశ్మీరీలు జైలులో ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందా?'.. కాంగ్రెస్‌పై ఒమర్‌ అబ్దుల్లా ఫైర్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీనగర్‌లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జాతీయ గేయం 'వందేమాతరం'ను పూర్తిగా ఆలపించే అంశం కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) మధ్య వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తాజాగా స్పందించారు.

వివరాలు 

చట్టం అందరికీ వర్తిస్తుంది: ఒమర్

'జాతీయ గేయానికి సంబంధించి ఇటీవల చట్టం తీసుకొచ్చారు. అందులో వందేమాతరంలోని అన్ని చరణాలను ఆలపించడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధన కేవలం జమ్ముకశ్మీర్‌కు మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.

'మా పార్టీ సిద్ధాంతాలకు, వందేమాతరానికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ దేశంలో అమలులో ఉన్న చట్టాలను మేం గౌరవించి, పాటిస్తాం.

అలా కాకుండా చట్టాన్ని వ్యతిరేకించి కశ్మీరీలు జైలుకు వెళ్లాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందా?' అని ఆయన ప్రశ్నించారు.

వివరాలు 

అసలేం జరిగింది?

శ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వందేమాతరం పూర్తిగా ఆలపించే వరకు ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా సహా అక్కడున్న వారంతా నిల్చొనే ఉన్నారు.

అయితే వందేమాతరాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీనిపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్పందిస్తూ.. తాము ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, మిత్రపక్షాలపై షరతులు విధించే అధికారం కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేసింది.

దీంతో వందేమాతరం పూర్తి ఆలాపన అంశం రెండు పార్టీల మధ్య రాజకీయ వివాదంగా మారింది.

ADVERTISEMENT