Page Loader
Delhi: ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్‌ 2 మూసివేత!
ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్‌ 2 మూసివేత!

Delhi: ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్‌ 2 మూసివేత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2025
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌ 2ను మంగళవారం (ఏప్రిల్‌ 16) నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై ప్రయాణికులను ముందుగానే అప్రమత్తం చేశారు. కొత్తగా ఆధునిక సౌకర్యాలతో టెర్మినల్‌ 2ను పునర్నిర్మించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2006లో నిర్మించిన టెర్మినల్‌ 2ను పూర్తిగా ఆధునికీకరించి, అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా మలచనున్నట్లు అధికారులు వెల్లడించారు. సరికొత్త హంగులతో టెర్మినల్‌ 2 మరింత విస్తృతంగా రూపుదిద్దుకోనుంది.

Details

ఇండిగో విమానాల మార్పు

ప్రస్తుతం టెర్మినల్‌ 2 నుంచి రాకపోకలు సాగిస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 122 విమానాలన్నీ టెర్మినల్‌ 1కి తరలిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మంగళవారం నుంచి ఈ మార్పు అమలులోకి వస్తుందని పేర్కొంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి ముందుగానే టెర్మినల్‌ వివరాలను తెలుసుకోవాలని సంస్థ సూచించింది.

Details

టెర్మినల్‌ 1, 3 నుంచే రాకపోకలు 

విమానాశ్రయం మూల్యాంకనాల్లో ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు ప్రపంచంలోని అత్యధిక రద్దీ గల టాప్ 10 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విస్తృత రద్దీకి అనుగుణంగా టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం టెర్మినల్‌ 1, 3 నుంచే అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలు కొనసాగనున్నాయి. ఈ మార్పుల గురించి ప్రయాణికులకు ముందుగానే విమాన సంస్థలు మెసేజ్‌లు పంపించి సమాచారం. అందించాయి. ఎవరైనా ప్రయాణికులు టెర్మినల్ మార్పుల విషయంలో సందేహాలు లేదా ఇబ్బందులు ఎదుర్కొంటే సంబంధిత ఎయిర్‌లైన్‌ సంస్థలను సంప్రదించవచ్చని సూచించారు. ఇది తాత్కాలిక అసౌకర్యమే అయినా, భవిష్యత్‌లో ప్రయాణికులకు మెరుగైన అనుభవం కల్పించేందుకు దోహదపడే ప్రణాళికల్లో ఇది భాగమని అధికారులు స్పష్టం చేశారు.