Loading...
Ponnam: సమస్యలను పరిష్కరిస్తాం.. సమ్మెను విరమించుకోవాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి!
సమస్యలను పరిష్కరిస్తాం.. సమ్మెను విరమించుకోవాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి!

Ponnam: సమస్యలను పరిష్కరిస్తాం.. సమ్మెను విరమించుకోవాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆటో కార్మికులు సమ్మెకు దిగాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ సమ్మె నిర్ణయంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో 'పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెల్లో ప్రజాపాలన' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు.

వివరాలు

ప్రత్యేక కమిటీ ఏర్పాటు

2015తర్వాత ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరిగిన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. ఆటో కార్మికులకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

పాత ఆటోలను స్క్రాప్‌ చేసి కొత్త ఎలక్ట్రిక్‌ ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. దశలవారీగా ఎలక్ట్రిక్‌ ఆటోలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆటో కార్మికుల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు.

ADVERTISEMENT