Page Loader
Weather Report: తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Weather Report: తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంపై రుతుపవన ద్రోణి ప్రభావం చూపించడంతో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా గురువారం రోజున కొమరం భీమ్ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే శుక్రవారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పేర్కొన్న జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.