
పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు బంకురా చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా మృతదేహం రాష్ట్రంలో కలకలం రేపింది.
ఈ ఘటనతో ఆగ్రహావేశాలకు లోనైన భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ఈ క్రమంలోనే సీబీఐ విచారణను పార్టీ డిమాండ్ చేసింది.
ఇటీవలే జరిగిన మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్న మిశ్రా వారం రోజులుగా కనిపించకుండాపోయారు.
నిధిరాంపూర్ గ్రామంలో చేతులు కట్టివేసి ఉన్న అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలోనే మిశ్రా హత్య వెనుక అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.
ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలోనే బీజేపీ నిరసన చేపట్టింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల తీవ్ర నిరసన
#WATCH | BJP workers in West Bengal's Bankura hold protest against TMC govt and local administration after the death of a BJP worker in Nidhirampur village of the district pic.twitter.com/sMBJUbi9LR
— ANI (@ANI) November 8, 2023